
Latest Telugu Movie News
Telugu Movie news
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరి’ విడుదలకు సిద్ధమైంది. హాట్ సమ్మర్లో కూల్ ‘లవ్ స్టోరి’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను దేశ రెండో అత్యుత్తమ పౌరపురస్కారం పద్మ విభూషణ్‌తో భారత ప్రభుత్వం గౌరవించింది. మనణానంతరం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది.
రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న ‘అన్నాత్తే’ నిజానికి గతేడాది విడుదల కావాల్సింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో షూటింగ్ ఆగిపోయింది.
మస్తీస్లో అలాంటి పాత్ర చేస్తే.. రియల్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందా? ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసా అంటున్నారా?? ఎలాంటి దాన్ని నేను?? నాతో మాట్లాడారా?? నన్ను దగ్గర నుంచి చూశాారా??
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ దర్శకుడు అనిల్ రావిపూడిని కలిశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది రామ్ చరణ్ తరవాత సినిమా కోసమేనా అనేది చర్చ.
‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర హీరోగా మరో సినిమా రాబోతోంది. ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభంకానుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మ దీవెన’. లాక్‌డౌన్‌కు ముందే పూర్తయిన ఈ సినిమా ఇప్పుడు విడుదలవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్. ఈ మేరకు ఎంపీ సంతోష్ కుమార్‌పై ప్రశంసలు గుప్పించారు.
సుప్రీం హీరో సాయి తేజ్ మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘రిపబ్లిక్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.
రీ- ఎంట్రీ ఇస్తూ ఇస్తూనే వరుస సినిమాలను కమిటైన పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. దగ్గుబాటి రానాతో కలిసి చేయబోతున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు.
మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గురు పవన్ దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత మహేష్ గొల్ల ‘ఇదే మాకథ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. బైక్ రేసింగ్ నేపథ్యంలో జరిగిన రైడర్స్ జీవితాలు అనుకోని పరిస్థితుల్లో ఏవిధంగా చెంజెస్ అయ్యాయి అనేది చిత్ర మెయిన్ కథాంశం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.
కాగా ఈ చిత్రం అఫీషియల్ టీజర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘ప్రతి మనిషి లైఫ్‌లో ఓ మెమరబుల్ జర్నీ ఉండాలి.. అలాంటి జర్నీలో మరిచిపోలేని పరిచయాలూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రేమ కూడా ఉండాలి’ ‘బట్ థ్రిల్ ఛేంజస్ లైఫ్’ అంటూ సుమంత్, శ్రీకాంత్ చెప్పే సంభాషణలతో ప్రారంభమయ్యే టీజర్ ఆద్యంతం అలరిస్తుంది. దీని బట్టి చూస్తుంటే నలుగురు వ్యక్తులు తమ రోడ్డు ప్రయాణంలో పరిచయమై ఓ ఓ ఛాలెంజ్ లో పాల్గొంటారనిపిస్తుంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఇదే మాకథ’ టీజర్ చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని.. అవ్వాలని కోరుకుంటున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
సి. రాంప్రసాద్ కెమెరా వర్క్ సినిమాకి వన్ ఆఫ్ ది హైలెట్ కానుంది. అలాగే యువ సంగీత కెరటం సునీల్ కాశ్యప్ అందించిన పాటలకి శ్రోతల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి డివోపి; సి. రాంప్రసాద్, మ్యూజిక్; సునీల్ కాశ్యప్, ఎడిటర్; జునైద్ సిద్ధికీ, ఆర్ట్; జేకే మూర్తి, యాక్షన్; పృద్వి శేఖర్, కాస్ట్యూమ్స్; ఎస్ ఎస్. వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; చిరంజీవి లంకెళ్ల, పీఆర్ఓ; వంశీ-శేఖర్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గురు పవన్, నిర్మాత; మహేష్ గొల్ల.
{youtube}v=EAYsU32J-Vg|620|400|1{/youtube}
ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు ఉత్పన్నం అవుతుంటాయి. రాజకీయాలు, ప్రజాస్వామం ఈ రెండు నిత్యం పరఢవిల్లుతుండాలని ఆకాంక్షించే మదిలోంచి పుట్టిన మరో కథ రిపబ్లిక్. సుప్రీంహిరో సాయిధరమ్ తేజ్, వరుస హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న నటి ఐశ్వర్య రాజేష్ లు జంటగా దేవ కట్టా రూపోందిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది.
దేవకట్టాకు మంచి ప్రావిణ్యం వున్న సబ్జెక్టుతో రూపోందిన ఈ మోషన్ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ వాయిస్ ఓవర్ లో తో ప్రారంభమవుతోంది, కోర్టు హాలులో కథనాయకుడు చెప్పే డైలాగులతో ప్రారంభయ్యే వాయిస్ ఓవరల్ లో ప్రజాస్వామ్యంలో మూడు పునాదులైన శాసన, నిర్వాహణ, న్యాయ వ్యవస్థల గురించి పేర్కోన్నారు, ఈ మూడు కీలక వ్యవస్థలు ఒకరినోకరు సరిచేసుకుంటూ ఐక్యంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యం గోప్పతనాన్ని చాటాలని పేర్కోనడం గమనార్హం. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ నేను గోప్ప అంటునన్న నేటి తరుణంలో ప్రజాస్వామ్యం గోప్పతనం చాటే చిత్రంగా ఇది రూపోందుతోంది.
వ్యవస్థల అధిపత్యంతో ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న క్రమంలో రూపోందుతున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు దర్పణం పడుతుందా.? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మోషన్ పిక్చర్ లో మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ సంగీతం సరిగ్గా సమకూరింది. ఈ చిత్రంలో సీనియర్ నటులు జగపతి బాబు, రమ్య కృష్ణ కూడా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ సహా అన్ని అనుకున్న సమయానికి కుదిరితే ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం కృతనిశ్చయంతో వుంది.
{youtube}v=mhmSfYcT7NM|620|400|1{/youtube}
దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్ డేట్ కోసం గత కొన్ని రోజులుగా అభిమానులు వేచిచూస్తన్న విషయం తెలిసిందే. ఒలీవియా మోరిస్ అనుకోకుండా రెండు రోజుల క్రితం లీక్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన విషయం తెలిసనప్పటి నుంచి అభిమానులు.. ఔనా ఇది నిజమేనా అంటూ సినీవార్తల పట్ల సోషల్ మీడియాలో కథనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. చిత్ర విడదలకు ముహూర్తం ఫిక్స్ అయిందా.. అనేదే.
ఇదివరకే పలు పర్యాయాలు విడుదల తేదీలు ప్రకటించిన వాయిదా పడిన చిత్రం.. ఇక కరోనా మహమ్మారి నేపథ్యంలో చిత్రల షూటింగ్ కు బ్రేక్ పడటంతో.. మరోమారు చిత్ర విడుదల తేది వాయిదా పడింది. అయితే ఇంతకీ ఈచిత్రం విడుదల ఎప్పుడంటూ అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులతో పాటు దర్శక ధీరుడి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు తాజా అప్ డేట్ ఇస్తామంటూ అకట్టుకున్న చిత్ర యూనిట్ ప్రకటన.. అభిమానుల ఎదురుచూపులకు విరామం కల్పిస్తూ చిత్ర విడుదల తేదీని ఫిక్స్ చేసింది.
మెగాపవర్ స్టార్ రాంచరణ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఇద్దరు యంగ్ హీరోలతో కూడిన కొత్త పోస్టర్ ను విడుదల చేసిన చిత్రబృందం.. చక్కటి క్యాప్షన్ ను కూడా పెట్టింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గుర్రంపై దూసుకెళ్తుండగా, తారక్ బుల్లెట్ పై వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అభిమానులను ఎంతగానో అకర్షిస్తోన్న ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిత్రబృందం.. దానికి మరింత జోష్ ను నింపేలా కొటేషన్ రాసింది.
ఈ ఏడాది అక్టోబర్ 13న నీరు-నిప్పు కలిసి మీ ముందుకు వస్తున్నాయి. గతంలో మీరు ఎప్పుడూ చూడని, వినని అత్యంత ప్రభావం కలిగిన శక్తి మీ ముందు అవిష్కృతం కానుంది. భారతీయ సినిమాలో ఈ అతిపెద్ద శక్తుల కలయిన అద్భుతమైన అనుభూతిని ఇవ్వనుంది. ఈ అనుభవాన్ని మీరు అందుకునేందుకు సిద్దంగా వుండండీ అంటూ చిత్ర బృందం కొటేషన్ రాసింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం కనబడుతోంది. ఆడపడచులు రంగవళ్లులు, గోబ్బమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, సరదా సవాళ్లు, కొత్త అల్లుళ్లు, బావమరదళ్లు, ఏ ఇల్లు చూసినా.. పిల్లాపాపలతో కుటుంబసమేతంగా సంతోషంగా గడుపుతారు. ఇలా పండగ మూడు రోజులే అయినా వారం రోజుల వరకు పండగశోభ ప్రతీ పల్లెలో ప్రత్యక్షం అవుతుంది. అలాంటి పండగ రోజున రవితేజను సినీ ఫైనాన్షియర్ అడ్డుకోవడమేమిటీ అంటారా.? సంక్రాంతి అంటే కొత్త సినిమాలు క్యూ కడుతాయన్న విషయం కూడా తెలిసిందే కదా.?
కోవిడ్ కారణంగా లాక్ డౌన్, ఆ తరువాత అన్ లాక్ నేపథ్యంలో సినిమా ధియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు. దీంతో సంక్రాంతి సీజన్ లో కొత్త సినిమాలతో మళ్లి సినిమా థియేటర్లకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనికి సాయితేజ్ నటించిన సోలో బతుకే సో బెటరు అన్న చిత్రం అంకురార్పణ కూడా చేసింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగానే అదరించారు. మంచి కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టింది. ఇక ఆ ఒరవడిని మరింత బలోపేతం చేయడానికి రెడీ అయిన మాస్ మహారాజా చిత్రానికి అనూహ్యంగా చెన్నైకి చెందిన ఓ సినీ ఫైనాన్సియర్ బ్రేకులు వేయించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడుగా రూపొందుతున్న 'క్రాక్' చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదల చేసేందుకు అంతా సిద్దమైన తరుణంలో చిత్ర నిర్మాత మధు తో వున్న ఆర్థికపరమైన వ్యవహరాలపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను క్రాక్ చిత్ర నిర్మాత మధుకు అయోగ్య చిత్ర నిర్మాణానికి గాను పది కోట్ల రూపాయలు ఇచ్చానని, అయితే ఆ చిత్రాన్ని నిర్మించే బదులు ఆ డబ్బుతో ఆయన క్రాక్ చిత్రాన్ని నిర్మించి విడుదల చేస్తున్నట్టు.. దీంతో చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం ఆయనకు సానుకూలంగా తీర్పునిచ్చింది. ఫైనాన్షియర్ కు రూ.10 కోట్లు ఇచ్చిన తరువాత చిత్రాన్ని విడుదల చేయాలని అదేశాలు జారీ చేసింది. దీంతో క్రాక్ చిత్రం విడుదలకు బ్రేకులు పడ్డాయి.
ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా ధియేటర్లలోకి తన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’తో ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. నభానటేష్ కథానాయిక. ‘వినూత్నమైన పాయింట్ కు చక్కటి భావోద్వేగాలు, వినోదాన్ని జోడిస్తూ దర్శకుడు సుబ్బు అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నెల (డిసెంబర్) 25న చిత్రాన్ని విడుదల కానుంది
చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఇక మరో వారంలో చిత్రం విడుదల చేయనుండగా, తాజాగా ప్రోమో విడుదల చేశారు. ఇందులో శ్లోకాలు అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చిన మెగా హీరో థియేటర్ లో 108 శ్లోకాలతో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహా చిత్రంలో చెప్పిన మాస్ డైలాగ్ ను తిరగేసి తన శ్లోకంగా మార్చేసిన తేజ్.. చరిత్రలో సుఖపడని వారెవరో చాలా వివరాణాత్మకంగా చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకున్నవాడు నిత్యం తన భార్య చేతిలో ఫూల్ అవుతూనే వుంటాడని విభిన్నంగా సెలవిచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత థియేటర్లో సందడి చేయనున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా ప్రోమో చూసేద్దామా..!
{youtube}v=NM6o66NUu94|620|400|1{/youtube}
బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా 'విరాటపర్వం'లోని దగ్గుబాటి రానా పాత్ర 'కామ్రేడ్ రవన్న'ను పరిచయం చేస్తూ, ఫస్ట్ గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం చిత్రయూనిట్ విడుదల చేసింది. లీడర్ చిత్రం నుంచి ప్రారంభమైన రానా సినీకెరీర్ లో తాజాగా నిర్మితమవుతున్న చిత్రం ఆయనను మాస్ ప్రేక్షకులకు చేరువ చేసేలా వుంది.
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తుండగా, రానాతో పాటు సాయి పల్లవి, ప్రియమణి, నివేదితా పేతురాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ టీజర్ లో రానా నక్సల్స్ నేతగా కనిపిస్తున్నాడు. చేతిలో గన్ పట్టుకుని, తన సహచరులతో కలిసి నడుస్తుండటం, అడవుల దృశ్యాలు, వాటర్ ఫాల్స్, కొన్ని సీన్స్ జోడించారు. "ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది..." అంటూ ప్రారంభమయ్యే టీజర్ లో "సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.." అన్న లెటర్స్ కనిపిస్తున్నాయి. ఇక రవన్న పాత్ర నక్సల్ గా మారకముందు డాక్టర్ రవిశంకర్ అన్న విషయాన్ని కూడా రివీల్ చేశారు. టీజర్ చివర్లో "ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం, దొపిడి రాజ్యం" అని కూడా వినిపిస్తోంది.
'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇప్పుడు ఆ చిత్రం నిజంగానే భయపెడుతోంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా కథ సమకూర్చి, నిర్మించగా, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ధియేటర్లు ప్రారంభమైన వేళ, మొట్టమొదట విడుదలైన తెలుగు సినిమా ఇదే కావడం.. అటు కరోనా భయాందోళన ఇటు చిత్రంపై పెద్దగా ఎలాంటి ప్రచారం కూడా జరగకపోవడంతో సినిమా ధీయేటర్లకు ప్రేక్షకులు అశించినంతగానే కాదు.. అరకోర కూడా రావడం లేదు.
దీంతో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా వున్నాయన్న అసక్తితో మీడియా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా ఈ సినిమా వసూళ్ళు అత్యంత ఘోరంగా నిలిచాయి. సినీ ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యాలకు షాకిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున కేవలం రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ మాత్రమే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ వసూళ్ల తాకిడి చూస్తే కనీసం సినిమా చిత్రీకరణ సమయంలో క్యాటరింగ్ ఖర్చులు కూడా వచ్చేలా వున్నాయా.? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తన చిత్రాలకు అనునిత్యం నెగిటివ్ పబ్లిసిటీతో టాక్ వచ్చేలా చూసుకునే వర్మ.. కరోనా వైరస్ చిత్రంలో మాత్రం పాజిటివ్ అప్రోచ్ తో వెళ్లి బోల్తాపడ్డాడు.
లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ ఇంట్లోని వారిని కరోనా వైరస్ ఎలా భయపెట్టిందన్న కథాంశంతో ఈ చిత్రం తయారైంది. ఈ సినిమా ప్రపంచంలోనే కరోనాపై తీసిన తొలి చిత్రమని వర్మ ఎంతగా ప్రచారం చేసుకున్నా, ఒక్కో థియేటర్ లో పదుల సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక, ఈ నెల 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రొమాంటిక్ డ్రామా 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి.
కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వీఐపి బ్రేక్ దర్శనంలో భాగంగా ఈ కొత్త జంట అత్తామామలతో కలసి దైవదర్శనం చేసుకుంది. ఇక ఇదే సమయంలో అటు మెగా బ్రదర్ నాగబాబు కూడా తన కూతురు కళ్యాణానికి సంబంధించిన విశేషాలను తన సోషల్ మీడియా మాద్యమంలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అంగరంగవైభవంగా ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ అందాలను చూపారు.
హైదరాబాద్ నుంచి ఉదయ్ పూర్ పయనం అవ్వడం అక్కడ నేరుగా హోటల్ లోకి చేరుకోవడం అంతా చకచకా చూపించారు. నాగబాబు, ఆయన సతీమణి పద్మజ, వధెువు నిహారికలతో కలసి వెళ్తూ.. మార్గమధ్యలో సోదరుడు వరుణ్ తేజ్ ను ఎక్కించుకుని నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లారు, అక్కడ వరుడు చైతన్య ఆయన కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక విమానంలో నేరుగా జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి డిస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ ఒబెరాయ్ హోటల్ ఉదయ్ విలాస్ లోని సూట్ రూమ్ లోకి వెళ్లిన నాగబాబు.. వెళ్లగానే హోటల్ వారు ఇచ్చిన వెలకమ్ బాక్స్ ను ఓపెన్ చేసి అందులోని ఐటమ్స్ చూపించారు. కుకీస్, చాక్లెట్స్, శానిటైజర్, మాస్క్ సహా పలు ఐటమ్స్ అందులో వున్నాయి.
ఇక ఆ తరువాత వెడ్డింగ్ ప్లాన్ ఎలా రెడీ అయ్యిందో.. దానిని ఎలా హోటల్ వారు షెడ్యూల్ చేశారో కూడా చూపించారు. ఇక అదే రోజు రాత్రి మెహిందీ వేడుక, తరువాతి రోజు హల్దీ వేడుక.. అంతకుముందు సంగీత్ కార్యక్రమం.. ఇలా ఒకదాని తరువాత మరో ఏర్పాటు చకచకా జరిగిపోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో కేవలం కొద్దిపాటి కుటుంబసభ్యులను, మరికోందరు స్నేహితులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించారు. ఇక సంగీల్ ఎలా జరిగిందీ.. రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలందరూ ఈ వేడుకలో ఎలా ఎంజాయ్ చేసింది కూడా చూపించారు. ఇలా పెళ్లినాటి వీడియోలను అభిమానులతో పంచుకున్న నాగబాబు తాను కూడా చిన్నపిల్లాడిలా మారి డాన్సులు వేసిన వీడియోలు ఇందులో కనువిందు చేస్తాయి. మరెందుకు ఆలస్యం మీరూ చూడండీ..!
కొణిదెల యువరాణి మెగా డాటర్ గా ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ ఒక్కటైంది. పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య అంగరంగవైభవంగా ఉదయ్ పూర్ కోటలో మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ ఇవాళ రాత్రి 7.15 నిమిషాలకు ఈ జంట ఒక్కటైంది. మెగా బ్రదర్ నాగబాబు దంపతులు శాస్త్రోక్తంగా పెళ్లికొడుకు చైతన్య కాళ్లు కడిచి కన్యాదానం చేశారు. అనంతరం వధూవరులు ఇరువురి తలపై జిలకర్ర-బెల్లం పెట్టించిన వేదపండితులు.. ఆ తరువాత వరుడు చైతన్య చేత నిహారిక మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం సప్తపది, పాణిగ్రహణం, అరుంధతి నక్షత్ర వీక్షణం వంటి కార్యక్రమాలన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రాజస్థాన్ లోని ఉదయపూర్ రాజమందిరం ఉదయ్ విలాష్ లో జరిగిన ఈ మెగా వివాహానికి కొణిదెల, అల్లు, జొన్నలగడ్డ కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరై కొత్తజంటను మనసారా ఆశీర్వదించారు. ఈ కొత్త జంట కళ్యాణం కమనీయంగా సాగాలని మూడు రోజులుగా మెగా కుటుంబాలు ఉదయ్ పూర్ కోటలోనే బసచేస్తున్నాయి. సంగీత్ సహా ముందస్తు పెళ్లి వేడుకలన్నీ ఘనంగా జరిగాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిన్న రాత్రి ఉదయ్ పూర్ చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా పండుగ వాతావరణం రెట్టింపు అయ్యింది. సంగీత్ సహా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇక పవన్ కల్యాన్, ఆయన తనయుడు అకీరా, తనయ ఆధ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కొత్త జంట నిహారిక-చైతన్యలను మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన సంగీత్ కార్యక్రమంలో చిరంజీవి, అరవింద్ దంపతులు కూడా పలు పాటలకు స్టెప్పులు వేశారు. దీంతో అక్కడే వున్న యంగ్ హీరోలు ఈలలు, కేకలతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. ఇక నిహారిక వివాహమైన సందర్భంగా అమె తండ్రి నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ‘నా కుమార్తె పాఠశాలకి వెళ్లిన తొలి రోజులాగా అనిపిస్తుంది. అయితే ఆమె ఇక సాయంత్రం తిరిగి ఇంటికి రాదు. నా చిన్నారి ఎదిగి, పాఠశాలకి వెళ్తున్నప్పుడు ఇకపై ఆమెతో రోజంతా ఆడుకోలేనని నా మనసుకు చెప్పడానికి కొన్నేళ్లు పట్టింది. ఈసారి ఎంత కాలం పడుతుందో కాలమే నిర్ణయిస్తుంది’’ అంటూ సోషల్ మీడియాలో నాగబాబు పేర్కోన్నారు.
నటీనటుల జీవితాలు అత్యంత విలాసవంతంగా, సుఖసంతోషాలతో అనునిత్యం ఆనందడోలికల్లో మునిగి తేలుతుంటాయని అనుకుంటారు ప్రేక్షకులు. అయితే దూరపు కొండలు నునుపు అన్న చందంగా ఈ మధ్యకాలంలో పలువురు నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ బలవన్మరణాలకు వారు ఎదుర్కోంటున్న తీవ్ర ఒత్తిడే కారణం కావచ్చు అంటున్నారు సినీవిశ్లేషకులు. కారణాలు ఏవైనా కావచ్చు కాక.. వాటిని ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాల్సిందే తప్ప.. ప్రాణాలను తీసుకుంటే ఇధి తమను అభిమానించే ప్రక్షకులకు తప్పుడు సంకేతాలను పంపుతుంది. తాజాగా తమిళ నటి వి.జె.చిత్ర (28) ఇలాంటి చర్యలకే పాల్పడింది. ఫైవ్ స్టార్ హోటల్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది,
తమిళంలో (కాలీవుడ్) టెలివిజన్ రంగంలో రాణిస్తున్న ఓ యువ నటి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అర్ధరాత్రి షూటింగ్ ముగించుకొని హోటల్ రూంకి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. నటి ఆత్మహత్యతో తమిళ టెలివిజన్ రంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు టీవీ. సినీ ప్రముఖులు అమె మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే నిత్యం నవ్వుతూ కనిపించే అమె.. ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడటం వెనుక కారణాలు ఏమై ఉంటాయా.? అని విచారం వ్యక్తం చేశారు. ‘పాండియన్ స్టోర్స్’ టీవీ సీరియల్ ద్వారా పాపులారిటీ సాధించిన చిత్రకు కొద్ది నెలల క్రితమే ఆమెకు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా జరిగింది.
చిత్ర మంగళవారం అర్ధరాత్రి వరకు పాండియన్ స్టోర్స్ సీరియల్ షూటింగ్ లో పాల్గొని బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు చెన్నైలోని నజ్రత్ పెట్టయ్ లో ఉన్న హోటల్ రూమ్ కు చేరుకొంది. కాబోయే భర్త హేమంత్ తో కలిసి కొద్దిరోజులుగా ఆమె అదే హోటల్ లో ఉంటోంది. 2.30 గంటలకు హోటల్ రూంకు చేరుకున్న చిత్ర ఫ్రెష్ అయ్యి వస్తానని కాబోయే భర్తతో చెప్పి మరో గదిలోకి వెళ్లి ఎంతవరకూ తిరిగి రాలేదు. హేమంత్ వెళ్లి పిలిచినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నకిలీ తాళం చెవి కోసం హేమంత్ హోటల్ సిబ్బందిని పిలిచాడు. వారు వచ్చి తలుపులు తెరవగా నటి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది పోలీసులకు తెలియజేయగా వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మానసిక ఒత్తిడి కారణంగానే చిత్ర బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
Tollywood News (English version)
Power Star and Rana Daggubati's big-ticket film with Sithara Entertainments and Saagar K Chandra has begun its shoot.
'Dhamarukam' fame Sreenivass Redde-written 'RadhaKrishna' will release in theatres on February 5.
'Monster Hunter', starring Mila Jovovich and Tony Jaa, will release in theatres on February 5.
'C/O Kaadhal', directed by Hemambar Jasti, is the Tamil remake of 'C/o Kancharapalem'.
'Pranavam', starring 'Ee Rojullo' fame Sri Mangam, has locked its release date.
‘Sarkaru Vaari Paata’, starring Mahesh Babu, is directed by Parasuram Petla.
The first single from 'FCUK' was today released by acclaimed orthopedic specialist Dr.
Superstar Mahesh Babu's fans have created history with the trends of 'Sarkaru Vaari Paata'.
On the eve of Republic Day, ZEE5 has come up with new offerings.
About Tollywood
Tollywood refers to the Telugu language film industry. The name derives the concept from Hollywood.Tollywood is based in the state of Andhra Pradesh in southern India. The major Tollywood studios are located in Hyderabad, AP. Tollywood is the largest producer of films in India. In average Tollywood produces between 200 and 250 Telugu movies a year.
Popular movies tend to open during the three festive seasons of the region: Sankranthi, Summer, and Dushera. The Telugu film industry accounts for 1% of the gross domestic product of Andhra Pradesh. Telugu films enjoy significant patronage in the neighboring southern States like Tamil Nadu, Karnataka.
The first Telugu film Bhishma Pratigna was made in 1922 by R.S. Prakash. The first Telugu talkie Bhakta Prahlada, was released in 1931.
Andhra Pradesh is the state having more than 2700 theaters, where Hyderabad alone consists of 150 theatres. It is arguably the state having the largest number of theaters.
For young heroines, waiting for a break in Bollywood - telugu movies are good place to begin with and are considered a gateway. This is because Tollywood is the biggest regional movie market in India and the work there is closely monitored by the big names in Hindi film industry who are on the lookout for storylines to remake and fresh talent be it actors or technicians.