Latest Telugu Movie News
Telugu Movie news
సినీజోష్ రివ్యూ: టిల్లు స్క్వేర్
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, మురళి శర్మ తదితరులు
మ్యూజిక్: రామ్ మిర్యాల, అచ్చు రమణి
BGM: భీమ్స్ సిసిరోలియా
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటింగ్: నవీన్ నూలి
రచన: సిద్ధు జొన్నలగడ్డ, రవి ఆంటోనీ
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
డైరెక్టర్: మల్లిక్ రామ్
రిలీజ్ డేట్: 29-03-24
DJ టిల్లు
టాలీవుడ్ లో ఓ స్ట్రాంగ్ ఫ్రాంచైజీగా మారింది
సిద్దు జొన్నలగడ్డ ని స్టార్ బాయ్ గా మార్చేసింది.
టిల్లు క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ పల్స్ పట్టేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. క్రేజీ కామెడీ, ట్రెండీ రొమాన్స్, థ్రిల్లింగ్ ట్విస్ట్ అనే ఎలిమెంట్సే బేసిక్ గా టిల్లు టార్గెట్. మళ్ళీ అదే టెంప్లేట్ ఫాలో అయిపోతూ ఈసారి డబుల్ డోస్ తో టిల్లు స్క్వేర్ ని తెరపైకి తెచ్చారు. ఈ మూవీలోని అనుపమ హాట్ లుక్స్ అండ్ సిద్ధుతో ఆమె కెమిస్ట్రీ ఫ్రమ్ ది బిగినింగ్ యూత్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేశాయి. ఇక సిద్దు జొన్నలగడ్డ గురించి చెప్పక్కర్లేదు... సినిమా అనౌన్సుమెంట్ దగ్గర్నుంచి పోస్టర్ డిజైన్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ వరకూ అన్నిట్లోనూ టిల్లు మార్క్ క్యారీ అయ్యేలా చూసాడు, ప్రేక్షకులు ఆకర్షితులయ్యేలా చేసాడు. అందుకే అన్నిచోట్లా మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న టిల్లు స్క్వేర్ ఆన్ స్క్రీన్ ఎంతవరకూ ఇంప్రెస్ చేయగలిగాడో రివ్యూలో చూద్దాం.!
టిల్లు స్క్వేర్ స్టోరీ: బాహుబలి, KGF, సలార్, పుష్ప, దేవర వంటి భారీ బడ్జెట్ చిత్రాలే తప్ప మీడియం రేంజ్ సినిమాల్లో అదే కథని కొనసాగిస్తూ సీక్వెల్ రావడం అనేది అరుదు. ఆ అరుదైన ప్రయత్నానికే పూనుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. DJ టిల్లు ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచే టిల్లు స్క్వేర్ కథని స్టార్ట్ చేయడంతో పాటు ప్రీవియస్ ఫిలిం కీ దీనికీ ఓ స్ట్రాంగ్ లింక్ కూడా సెట్ చేస్కోవడం విశేషం. తన లవర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని ఈవెంట్ ఆర్గనైజర్ గా ఎదిగిన టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) లైఫ్ లోకి ఈసారి లిల్లి (అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. ఒక పార్టీ లో ఆమెతో ఏర్పడ్డ పరిచయం, జరిగే ఫ్లర్టింగ్ అదే రాత్రి వాళ్లిద్దరూ శారీరకంగా కలిసిపోయేవరకు వెళుతుంది. అయితే మరునాటి ఉదయానికి గుడ్ బై అని నోట్ రాసి పెట్టి వెళ్ళిపోయిన లిల్లీ... మరికొన్ని రోజుల తరువాత తాను ప్రెగ్నెంట్ అయ్యానంటూ మళ్ళీ వస్తుంది. పెళ్లి చేసుకోమంటుంది. ఇటు లిల్లీ ప్రెజర్ చేయడం.. అటు ఇరు కుటుంబాలు ఓకే అనడంతో పెళ్ళికి ఒప్పుకుంటాడు టిల్లు. అయితే ఫస్ట్ పార్ట్ లో రాధిక (నేహా శెట్టి) చంపేస్తే తాను పాతిపెట్టిన రోహిత్ (కిరీటి రామరాజు)కి లిల్లీ చెల్లెలని తెలియడంతో షాక్ అవుతాడు టిల్లు. ఇక ఇక్కడ్నుంచి కథ అనేక మలుపులతో పరుగులు పెడుతుంది. అసలు లిల్లీ - టిల్లు లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, ఆపై టిల్లు ఎన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నదే టిల్లు స్క్వేర్ స్టోరీ. కథగా కాసింతే వున్నా కథనంలో మాత్రం సిద్దు మార్క్ చమక్కులు చాలానే ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ చాప్టర్ లో చర్చిద్దాం.
టిల్లు స్క్వేర్ స్క్రీన్ ప్లే: టిల్లు గాని జిందగీ లోకి ఒక పోరీ రావాలె, గాన్ని ఆగమాగం జెయ్యాలె... అనేదే బేసిక్ కాన్సెప్ట్ గా పెట్టుకుని మళ్ళీ అదే కథ రాసుకోవడం కష్టమైన పనే. అయితే టిల్లు స్క్వేర్ విషయంలో కథ కంటే కథనం బాగా వర్కవుట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ టైమింగ్ భలే మ్యాజిక్ చేసింది. పూర్తిగా టిల్లు క్యారెక్టరైజేషన్ పైనే బేస్ అయిపోయి తెరపై కదిలిన కథనం ఇది. సినిమా టేక్ ఆఫ్ లోనే సిద్దు తనదైన నటనతో టిల్లుని తీసుకెళ్లి ప్రేక్షకుల దిల్లులో పెట్టేసాక - ఇక ఆ రోల్ తో కనెక్ట్ అయిన ఆడియన్స్ వాడి ఫ్రస్ట్రేషన్ లోని ఫన్ ని ఎంజాయ్ చేస్తూ మూవీ మొత్తం చూసేస్తారు. ఫస్టాఫ్ అంతా ప్రెడిక్టబుల్ గానే ఉన్నా టిల్లు గా సిద్దు చేసిన హడావిడి, హంగామాలో అది కొట్టుకుపోతుంది. ఆపై సెకండాఫ్ క్రెడిట్ టోటల్ గా రైటింగ్ డిపార్ట్ మెంట్ పట్టుకుపోతుంది. నిజానికి ఆన్ పేపర్ రాసుకున్న కంటెంట్ కంటే... ఆన్ లొకేషన్ యాడ్ అయిన ఇన్ స్టెంట్ స్టఫ్ ఎక్కువుందేమో అనిపించేలా ఉంది టిల్లు స్క్వేర్. అలాగే కొన్ని సీన్స్ కోసం బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని హిట్ సాంగ్స్ ని యూజ్ చేసిన విధానం హిలేరియస్ గా పేలింది. ఓవరాల్ గా సెన్స్ అఫ్ హ్యూమర్ తో పాటు సెన్స్ అఫ్ స్క్రీన్ లాంగ్వేజ్ కూడా కలిగి ఉన్నప్పుడే ఇలాంటి సీక్వెల్స్ తో ఆడియన్సుని మళ్ళీ మళ్ళీ ఆకట్టుకోగలం అనిపించేలా ఉంది టిల్లు స్క్వేర్.
టిల్లు స్క్వేర్ ఎఫర్ట్స్: నిస్సందేహంగా ఇది సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. టిల్లు క్యారెక్టర్ కోసం ఓ పెక్యులియర్ అప్పీయరెన్స్ డిజైన్ చేసుకున్న సిద్దు ఆ పాత్ర ప్రవర్తన, పలికే డైలాగ్స్ పట్ల కూడా ఎంత కేర్ తీసుకుంటున్నాడో స్క్రీన్ పై స్పష్టంగా తెలుస్తోంది. మెయిన్ గా తనే రైటర్ కావడం సిద్ధుకి పెద్ద ప్లస్ అయింది. అందుకే సిద్దు బోయ్ వన్ లైనర్స్ ని థియేటర్స్ లో యూత్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఇంతటి బోల్డ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ తరహా పాత్రలకూ తనను కన్సిడర్ చేయొచ్చు అని చాటుకునేలా తెరపై రెచ్చిపోయిన అనుపమ హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ హార్ట్స్ ని కెలికేసింది. DJ టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఈ టిల్లు స్క్వేర్ లోనూ కాసేపు కనిపించి మెరుపులు మెరిపించింది. ప్రిన్స్ ఇంప్రెస్ చేసాడు.. మురళీశర్మ గెస్ట్ రోల్ లాంటిది పొందాడు. సిద్దు ఫాదర్ రోల్ చేసిన బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ ముచ్చటగా నవ్వులు పంచి మరోసారి నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు. అలాగే టిల్లుకి ఫుల్లుగా సపోర్ట్ చేసింది టెక్నికల్ టీమ్. రామ్ మిరియాల - అచ్చు రాజమణి అందించిన పాటలు సినిమా ఫ్లో లో పర్ ఫెక్ట్ గా మెర్జ్ అవ్వగా... భీమ్స్ నేపథ్య సంగీతం కథనానికి కరెక్టుగా అమరింది. ఇక టిల్లు ని కలర్ ఫుల్ గా తెరపైకి తేవడంలో సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ రాణిస్తే.. ఎడిటింగ్ లో నవీన్ నూలి తన నైపుణ్యం చూపించాడు. ప్రొడ్యూసర్స్ నాగవంశీ - సాయి సౌజన్యల నిర్మాణానికి వంక పెట్టలేం. డైరెక్టర్ మల్లిక్ రామ్ ని అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే సేమ్ DJ టిల్లు ఫార్మేట్ నే ఫాలో అవుతూ మరోసారి అదే టెంప్లేట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్సుని ఒప్పించడం, మెప్పించడం ఈజీ కాదు. ఆఫ్ కోర్స్, ఈ విషయంలో మల్లిక్ రామ్ కి సిద్దు సహకారం ఎంతో ఉన్నప్పటికీ ఆన్ స్క్రీన్ ఎక్సిక్యూషన్ విషయం లో దర్శకుడిగా తన ప్రతిభ ప్రదర్శించాడు మల్లిక్ రామ్.
టిల్లు స్క్వేర్ ఎనాలసిస్: కావాల్సినంత కామెడీని - కవ్వించే రొమాన్సుని ఆఫర్ చేస్తూ కన్విన్సింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చిన టిల్లు స్క్వేర్ టార్గెటెడ్ ఆడియన్సుని ఫుల్లుగా శాటిస్ ఫై చేసేస్తాడు. డైలాగ్స్ లో ఘాటు పెరగడం, రొమాన్స్ డోస్ ఎక్కువవడం ఫ్యామిలీ ఆడియన్సుని కాస్త ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ యూత్ అండ్ మాస్ ఆడియన్స్ కి మాత్రం మాంఛి కిక్ ఇస్తాయి. ముఖ్యంగా DJ టిల్లు చూసి ఇంప్రెస్ అయిన జనాన్ని టిల్లు స్క్వేర్ మరింత మెప్పిస్తుంది. ఇప్పటికే హ్యూజ్ ఓపెనింగ్స్ తో, పాజిటివ్ రిపోర్ట్స్ తో థియేట్రికల్ రన్ స్టార్ట్ చేసిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ సూపర్ హిట్ కొట్టెయ్యడం ఖాయంగానే కనిపిస్తోంది. టిల్లు ఫ్రాంచైజీ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈసారి మరింత భారీ అంచనాలను సూచిస్తోంది. కమాన్ సిద్దూ... TILLU Fans Are Eying On Your Hattrick.
సినీజోష్ రేటింగ్: 3/5
పంచ్ లైన్: సిద్దు బోయ్ వన్ మ్యాన్ షో !
సినీజోష్ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్
బ్యానర్: సోనీ పిక్చర్స్, గాడ్ బ్లెస్స్ ఎంటర్టైన్మెంట్, రెనసాన్స్ పిక్చర్స్
నటీనటులు: వరుణ్ తేజ్, మనిషి చిల్లర్, నవదీప్, రుహాణి శర్మ, మీర్ సర్వర్
మ్యూజిక్: మిక్కీ J మేయర్
సినిమాటోగ్రఫీ: హరి K వేదాంతం
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడ్యూసర్స్: సందీప్ ముద్దా
డైరెక్టర్: శక్తి ప్రతాప్
రిలీజ్ డేట్: 01-03 2024
తొలిప్రేమ, ఫిదా వంటి ప్రేమ కథలతో ఘన విజయాలు సాధించినా వరుణ్ తేజ్ చూపు మాత్రం ఎప్పుడూ విభిన్న కథలవైపే ఉంటుంది. ఆ ప్రయత్నంలో అపజయాలెదురవుతున్నా అడుగు మాత్రం అటువైపే పడుతూ ఉంటుంది. అదే కోవలో తాను తాజాగా చేసిన ఏరియల్ యాక్షన్ ఫిలిం ఆపరేషన్ వాలెంటైన్. ఇదే జోనర్ లో హృతిక్ రోషన్ చేసిన ఫైటర్ ని ఈమధ్యే ప్రేక్షకులు చూసారు. అయితే అది పక్కా కమర్షియల్ గా తీసిన సినిమా కాగా.. వాణిజ్య అంశాలకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా ఇంట్రెస్టింగ్ ఆపరేషన్ తో వచ్చాడీ వాలెంటైన్.
ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడై భర్త గా కొత్త జర్నీని స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్ కి ఇప్పుడీ వాలెంటైన్ పరాజయాల భారాన్ని దించాడా.. విజయ మాధుర్యాన్ని పంచాడా.. అనేది చూద్దాం ఈ రివ్యూలో, ఈ సినిమా రిజల్ట్ లో..
ఆపరేషన్ వాలెంటైన్ స్టోరీ రివ్యూ:
భారతీయ వైమానిక దళంలో పని చేసే అర్జున్ రుద్ర దేవ్ (వరుణ్ తేజ్) ఏం జరిగినా చూసుకుందాం.. అంటూ మొండితనంతో ముందుకు వెళ్లే వ్యక్తి. అదే శాఖలో పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా(మానుషి చిల్లర్) అతనితో ప్రేమలో ఉంటుంది. కానీ ఈ ప్రేమ కథ కొంతే.. సినిమాలో పరిమితమంతే. ఓ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించిన రుద్ర కి రివర్స్ స్ట్రోక్ తగులుతుంది. ఆపై అసలైన ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగిన రుద్ర చెలరేగిన తీరు, ప్రాజెక్ట్ వజ్ర వైనం తెరపై చూస్తేనే బావుంటుంది. నిజానికిది సినిమా కాదు. వాస్తవంగా జరిగిన వార్ తాలూకు పలు సంఘటనల సమాహారం. 2019 లో జరిగిన ఉగ్రవాదుల పుల్వామా ఎటాక్ నుంచి మన భారత వైమానిక దళం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు చాలా విషయాలు విశేషాలు, రహస్యాలు తెరపైకి తీసుకొచ్చిన ప్రయత్నం ఆపరేషన్ వాలెంటైన్. అందుకే ఇది కథగా కాసింతే అనిపించొచ్చు. స్క్రీన్ పై మాత్రం చూసేంత స్టఫ్ ఉంది.
ఆపరేషన్ వాలెంటైన్ స్క్రీన్ ప్లే రివ్యూ:
ఈ దర్శకుడికి ఇది తొలి చిత్రమేనా అని ఆశ్చర్యపోయేంత పట్టుతో, పట్టుదలతో రాసుకున్న కథనమిది. ప్రాజెక్ట్ వజ్ర అనే టాపిక్ తో స్టోరీ స్టార్ట్ చేసిన దర్శకుడు శక్తి అక్కడనుంచి వాస్తవిక సంఘటనలని వాడిగా, వేడిగా చూపిస్తూ ఆపరేషన్ వాలెంటైన్ లోకి ప్రేక్షకులని లీనం చేసేసాడు. ఇండియా - పాకిస్తాన్ మధ్య వైరం జోలికి పోకుండానే అనివార్యంగా జరుగుతున్న వార్ సన్నివేశాలని, సందర్భాలని, సంఘటనలని సాధ్యమైనంత సహజంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా పుల్వామా దాడి సన్నివేశాలు మనలోని దేశభక్తిని తట్టి లేపుతాయి. ఇంకొన్ని ఇంపార్టెంట్ సీన్స్ (ఇవి చూసి తీరాల్సినవే) అప్రయత్నంగా చప్పట్లు కొట్టేలా చేస్తాయి. గగనంలో జరిగే ఫైటర్ జెట్ల పోరాటాలు వీక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఏ లోపము లేని ప్రయత్నమే అయినా అనుకోకుండా తగిలిన శాపం ఏమిటంటే ఇదే రీతిలో, ఇదే బాటలో ఇటీవలే హృతిక్ రోషన్ లాంటి బడా బాలీవుడ్ స్టార్ చేసిన ఫైటర్ సినిమా రావడం, అప్రయత్నంగానే అందరిలోనూ ఆ రెండిటి మధ్య పోలిక కలగడం.!
ఆపరేషన్ వాలెంటైన్ ఎఫర్ట్స్ :
వరస పరాజయాలతో ఢీలాపడ్డ వరుణ్ తేజ్ కి వరంలా దొరికిన కథ ఇది. వాస్తవికతలోనే ఇటు హీరోయిజాన్ని, అటు తనలోని నటుడిని తెరపై పరిచే ఛాన్స్ దక్కించుకున్న వరుణ్ వంద శాతం తన బాధ్యత నిర్వర్తించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా తన ఆహార్యం ఆ పాత్రకు సరిగ్గా సూటైతే.. యాక్టర్ గా తన సిన్సియారిటీ స్క్రీన్ పై స్పష్టంగా రిఫ్లెక్ట్ అయ్యింది. మొత్తానికి రుద్రగా తనదైన ముద్ర వేసాడు వరుణ్. మిస్ వరల్డ్ మనిషి చిల్లర్ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి రోల్ నే దక్కించుకుని ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించింది. ఇక నవదీప్, రుహని శర్మ ఇతర తారాగణం బాగానే ఉన్నప్పటికీ అన్నీ అవసరానికి తగ్గ పాత్రలే. అందరివీ అందుకు తగ్గ అభినయాలే.
మరిక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. దర్శకుడు శక్తి ప్రతాప్ గురించే. అతని హార్డ్ వర్క్, హానెస్టీ ఫలితమే ఆపరేషన్ వాలెంటైన్. నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులనే తన సిన్సియర్ స్క్రిప్ట్ తో మెప్పించిన శక్తి ప్రతాప్ వారి నుంచే మరింత విలువైన సమాచారాన్ని పొందడం విశేషం. అంతేకాదు, అదే నిజాయితీని తాను చేస్తున్న పనిలో అణువణువునా చూపిస్తూ, తెరపై మనం అనుక్షణం చూసేలా చేస్తూ తన శక్తి సామర్ధ్యాలను చూపించాడు. మిక్కీ జే మేయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కాస్త నిరాశపరిచినా రెండు పాటలతో మాత్రం ఓకె అనిపించుకున్నాడు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు దేశభక్తిని ప్రేరేపించడానికి దోహదపడ్డాయి. నవీన్ నూలి ఎడిటింగ్ లో ఇంకాస్త షార్ప్ గా ట్రై చేసుంటే, డబ్బింగ్ వైజ్ డైరెక్టర్ ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే ఆపరేషన్ వాలెంటైన్ అవుట్ ఫుట్ మరికాస్త బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కి మాత్రం వంక పెట్టలేం. లిమిటెడ్ బడ్జెట్ లోనే ఆ స్థాయి విజువల్స్ ని వీక్షకులముందుకు తీసుకువచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ టీమ్ కి అభినందనలు.
ఆపరేషన్ వాలెంటైన్ ప్లస్ పాయింట్స్:
మెయిన్ థాట్
మెయిన్ ప్లాట్
మెయిన్ లీడ్
ఆపరేషన్ వాలెంటైన్ మైనస్ పాయింట్స్ :
నో కమర్షియలిటీ
నో ఎంటర్టైన్మెంట్
ఆపరేషన్ వాలెంటైన్ ఎనాలసిస్:
ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు అవార్డుల రేసులో పోటీపడొచ్చు. ఫిలిం ఫెస్టివల్స్ లో హవా చూపించొచ్చు. రేపనే రోజున ఓటిటీ ప్లాట్ ఫామ్ కి రాగానే ఓ రేంజ్ రెస్పాన్స్ ఉండొచ్చు. కానీ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తాయా అన్నదే సందేహం. అందుకు నేడు కనిపిస్తున్న ప్రారంభ వసూళ్లే నిదర్శనం. చూద్దాం.. హానెస్ట్ గా, సిన్సియర్ గా సినిమా చేసిన ఆపరేషన్ వాలెంటైన్ టీమ్ కి కలెక్షన్స్ వైజ్ ఆ పరేషాన్ కలగకూడదనే ఆశిద్దాం.
సినీజోష్ పంచ్ లైన్ : దర్శకుడి వజ్ర సంకల్పం
సినీజోష్ రేటింగ్: 2.75/5
సినీజోష్ రివ్యూ ఈగల్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ వర్మ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ, మధుబాల తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: దేవ్
సినిమాటోగ్రఫీ: కమ్లి శ్లాకి , కరమ్ చావ్లా
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని
స్క్రీన్ ప్లే: మణిబాబు
నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల
రచన-దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
రిలీజ్ డేట్ 09-02-2024
రెండు, మూడు ప్లాప్ లకు ఒక హిట్ పట్టుకుని కెరీర్ ని నెట్టుకుంటూ వస్తున్నాడు రవితేజ. క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటే ఖిలాడీ చేష్టలు చేసి రామారావు గా డ్యూటీ చేసి బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్స్ ఇచ్చాడు. అయితే చలాకి డాన్సుల చిచ్చర పిడుగు శ్రీలీల తో కలిసి చేసిన ధమాకా, స్పెషల్ రోల్ చేసిన చిరంజీవి వాల్తేర్ వీరయ్య రవితేజకి రిలీఫ్ నిచ్చాయి. కానీ రవితేజ మాత్రం తన రివాజు మళ్ళీ రిపీట్ చేసాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరావు సినిమాల రూపంలో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ డిజాస్టర్స్ చవి చూసి ఇప్పుడు ఈగల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి నేడు రిలీజ్ అయిన ఈగల్ రవితేజతో హ్యాట్రిక్ చేయించిందా.. ప్లాప్స్ లో నుంచి బయటికి తీసుకొచ్చిందా చూద్దాం.. సమీక్షలో..
స్టోరీ ఆఫ్ ఈగల్ :
నళిని(అనుపమ) అనే ఓ జర్నలిస్ట్ రాసిన కథనంతో స్టార్ట్ అవుతుంది ఈగల్. ఆమె రాసిన ఆర్టికల్ చిన్నదే అయినా.. పెద్ద స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈగల్ నెట్ వర్క్ అనేది తెరపైకి వస్తుంది. ఎన్నో ఇన్వెస్టిగేషన్ టీమ్స్, నక్సలైట్స్, తీవ్రవాదులు, విదేశీయులు అందరికి టార్గెట్ గా ఉంటుంది ఈగల్. అసలేమిటా ఈగల్ నెట్ వర్క్. ఒకే ఒక్క వ్యక్తి సహదేవ్ వర్మ (రవితేజ) నడుపుతోన్న ఆ ఈగల్ నెట్ వర్క్ టార్గెట్ ఏమిటి, నళిని ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈగల్ కి తలకోన అడవులకి ఉన్న సంబంధం ఏమిటి. అసలు సహదేవ్ గతమేమిటి ఇదే క్లుప్తంగా ఈగల్ కథ.
స్క్రీన్ ప్లే ఆఫ్ ఈగల్:
ఈమధ్య కాలంలో యాక్షన్ సినిమాల హావ జోరుగా సాగుతుంది అనేది అందరికి తెలిసిందే. ఓ వైపు రాజమౌళి మరోవైపు ప్రశాంత్ నీల్ తాజాగా సందీప్ రెడ్డి వంగా, తమిళ్ లో లోకేష్ కనగరాజ్ విలక్షణమైన యాక్షన్ చిత్రాలతో విధ్వంశం సృష్టిస్తున్నారు. అదే ప్రభావంతో తొలిసారి మెగా ఫోన్ చేపట్టిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈగల్ ని మోతాదుకుమించి ఎలివేషన్ సీన్స్ తో నింపేశారు. సినిమాలోని ప్రథమార్ధం మొత్తం హీరో కనిపించే స్క్రీన్ స్పేస్ తక్కువైనా హీరో ఎలివేషన్ సీన్స్ మాత్రం కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అసలు కథ ఆరంభమయ్యేది ఇంటర్వెల్ బ్లాక్ నుంచే. అయితే సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేకుండా కథనాన్ని శరవేగంగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ని చాలా పద్దతిగా కంపోజ్ చెయ్యడం ఈగల్ సినిమాకి ప్రధాన బలం. అలాగే క్లుప్తంగా తేల్చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. అన్ని పాత్రలకి సమన్యాయం చేసిన దర్శకుడు విజువల్స్ విషయంలో తనకున్న పట్టుని ప్రదర్శించాడు. BGM పరంగా తన అభిరుచిని చాటుకున్నాడు. క్లైమాక్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసి ఈగల్ కి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చాడు.
ఎఫర్ట్స్ ఫర్ ఈగల్:
సరైన కేరెక్టర్ దొరికితే అలవోకగా చెలరేగిపోయే రవితేజ సహదేవ్ పాత్రలో శివాలెత్తాడు. యాక్షన్ సీన్స్ లో తనదైన ఎనర్జీని చూపిస్తూనే యంగ్ లుక్ లోనూ సరికొత్త గ్రేస్ తో కనిపించి అభిమానులని అలరించాడు. వాటన్నిటిని మించి ఎమోషనల్ సీన్స్ లో విగరస్ పెరఫార్మెన్సుతో విజృంభించాడు. చాలా కాలం తర్వాత నవదీప్ కి ఆన్ స్క్రీన్ మెరుపులు మెరిపించే కేరెక్టర్ దొరికింది. అనుపమ పరమేశ్వరన్ ఈగల్ కథని వెలికి తీసే పాత్రలో సినిమా మొత్తం స్క్రీన్ పై కనిపించే స్పేస్ దక్కించుకుంది. కావ్య థాపర్ సెకండ్ హాఫ్ లో చిన్న పాత్రకే పరిమితమైనా అందంతో ఆకట్టుకుంది. శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ, మధుబాల తదితరులంతా తమ తమ పాత్రలమేరకు అభినయించారు.
ఇక ఈగల్ విషయంలో ప్రధానంగా, ప్రముఖంగా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కార్తీక్ ఘట్టమనేని గురించి. కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం మూడు విభాగాలని మోసిన కార్తీక్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అనే ఫీలింగ్ ప్రేక్షకులకి అసలు ఏమాత్రం కలగకుండా ఈగల్ ని తెరపైకి తెచ్చాడు. మెగా ఫోన్ బాధ్యతలని నిర్వర్తించడంలో కాస్త తడబడ్డాడేమో కానీ.. ఓవరాల్ గా మాత్రం రీసెంట్ గా వచ్చిన రవితేజ సినిమాలకంటే బెటర్ ఫిల్మే ఇచ్చాడు. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ లో కార్తీక్ శైలి కాంప్లిమెంట్స్ పొందుతుంది. ఖచ్చితంగా తనకి డైరెక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. డైలాగ్స్ ఆచితూచి మరీ కొలిచినట్టున్నాయి. దేవ్ నేపధ్య సంగీతం ఈగల్ కి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఈగల్ ని అటు మాస్ కి ఇటు క్లాస్ కి నచ్చే స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా తెరపైకి తెచ్చాయి.
ఎనాలసిస్ ఆన్ ఈగల్:
రవితేజ రీసెంట్ ఫామ్, ఫిబ్రవరి రిలీజ్ ఈగల్ ప్రారంభ వసూళ్లపై బాగా ప్రభావం చూపించాయి. అయితే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరి భారీగా పెరిగిపోయిన రెమ్యునరేషన్లు, ఫిల్మ్ మేకింగ్ కాస్ట్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ అన్ సీజన్ లో ఈగల్ హిట్టు మెట్టెక్కుతుందా అనేది అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. మరి మాస్ క్రౌడ్ పుల్లర్ మాస్ మహారాజ రవితేజ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎలా రప్పిస్తాడో.. ఏ స్థాయి వసూళ్ళని తెప్పిస్తాడో వేచి చూద్దాం.
సినీజోష్ పంచ్ లైన్: రవితేజ రఫ్ఫాడించాడు
సినీజోష్ రేటింగ్: 2.5/5
Click Here: Eagle Movie Public Talk Video..
Tollywood News (English version)
Producer Sahu Garapati of Shine Screens last year received a huge boost with the success of Nandamuri Balakrishna's 'Bhagavanth Kesari'.
Senior artist Raja Ravindra headlines a family drama titled 'Sarangadhariya', whose teaser has been unveiled at the hands of actor Sree Vishnu.
Passionate producer Venu Donepudi is currently bankrolling Gopichand's 'Viswam'.
Actress Nayanthara stays away from interviews.
Director Virinchi Varma is doing a political drama titled 'Jithender Reddy'.
Star heroine Pooja Hegde is said to be dating a small-time Bollywood actor named Rohan Mehra.
Nara Rohit awaits the release of 'Prathinidhi 2' on April 25.
Vijay Deverakonda's career has been on a downswing for the past few years.
Come December 20, two important releases are going to see a clash at the box office.
Angry Rantman is quite popular on social media, especially among movie buffs.
Satyam Rajesh awaits the release of 'Tenant' on April 19. In a previous interview about the movie, the senior artist commented that the film is for all sections of the family audience since it has got sentiment, emotion, suspense and other elements. Produced by Mogulla Chandrasekhar Reddy, the film co-stars Esther Noronha (as a cop), Megha Choudhary, Chandana Payyavula, and Bharat Kant. It is helmed by Y Yugandhar. Jemin Jom Ayyaneth (cinematographer), Vijay Mukthavarapu (editor), Robin Subbu (stunts) and YS Srinivas Varma (story writer) are working on the movie.
New writer-director Harshiv Karthik (also the film's editor and one of the dialogue writers) will be seen in 'Bahumukham'. Starring Swarnima Singh and Maria Martynova as the heroines, the film is coming from Crystal Mountain Productions. Shot in locations across Atlanta, Macon, Canton, and the surroundings of Georgia, and the US, it is expected to feature heavy dialogues. Ahead of the movie's release in theatres on April 5, Harshiv talks about its merits. Having manned multiple departments, he has proven himself to be one of the most passionate new-generation filmmakers.
'Tillu Square', says Siddu, is a completely fresh story. "This is not a Part 2. It's a sequel. The protagonist is from the first part, but the story is something else," the 'Krishna And His Leela' star says. The comedy caper will hit the cinemas on March 29 (Friday). Directed by Mallik Ram, the film has been produced by S Naga Vamsi of Sithara Entertainments. "Writing the 'Tillu' movies has been therapeutic. I will miss writing a Tillu movie," he added.
Actor Thrigun of 'PSV Garuda Vega' has acted in comedy and romantic roles in his long career. He recently said that while 'Chikati Gadilo Chithakotudu' is his most successful film to date, 'Line Man' is the kind of film he will be proud of. Incidentally, 'Line Man' also marks his Kannada debut. Helmed by V Raghu Shastry, the film was released in theatres today (March 22) in Telugu and Kannada. Ahead of the release of the movie produced by Purple Rock Entertainers, Thrigun talks about its merits, saying that the film is a mix of comedy, a sweet love story, and a heartfelt message.
Director Mallik Ram awaits the release of 'Tillu Square' on March 29. In this interview, he talks about working with the talented actor-writer Siddhu Jonnalagadda and others. The filmmaker sets the expectations right when he says what not to expect and what to expect from the comedy caper co-starring Anupama Parameswaran and others. The film, produced by Sithara Entertainments, is one of the most-awaited sequels of all time.
Sree Vishnu says that 'Om Bheem Bush' gives primacy to entertainment. Set to hit the cinemas on March 22, the film brims with hilarity. "This movie is best watched with your friends/family in groups," the actor says. Directed by Sree Harsha Konuganti, the film co-stars Priyadarshi, Rahul Ramakrishna and others.
Producer Razesh Danda of 'Samajavaragamana' and 'Ooru Peru Bhairavakona' fame turned a year older today. The supremo at Hasya Movies talks about his journey in brief, saying that he never believes in a hands-off approach. As a producer, says Danda, he wants to mold Hasya Movies into a banner that upholds refreshing subjects. "My previous and upcoming movies abide by the rule that the storyline must be unique," says Danda.
'Om Bheem Bush', touted to be a full-on comedy entertainer co-starring Sree Vishnu, Priyadarshi and Rahul Ramakrishna, will hit the cinemas on March 22. Helmed by Sree Harsha Konuganti, the film is brought out by UV Creations and V Celluloid (produced along with Sunil Balusu). In this interview, actor Priyadarshi talks about trying out an all-out comedy years after 'Jathi Ratnalu'. He reiterates that he believes in being an actor rather than a hero.
Sree Vishnu's 'Om Bheem Bush', touted to be a new-age comedy entertainer co-starring Priyadarshi and Rahul Ramakrishna, will hit the cinemas on March 22. Helmed by Sree Harsha Konuganti, the film is brought out by UV Creations and V Celluloid (produced along with Sunil Balusu). In this interview, director Harsha of 'Hushaaru' fame says that the film follows an exciting premise and has as much magic as it has logic in it. He daringly says that 'OBB' is ten times funnier than 'Samajavaragamana', adding that 90% of the screen time is occupied by the lead trio.
A Harsha believes in entertainment and emotion with a little dose of social message in his films. The Sandalwood maker, known for 'Vedha' (Kannada), awaits the release of Gopichand's 'Bhimaa' this March 8. In this interview, the filmmaker talks about his strong-willed beliefs as a director. He says that 'Bhimaa' is the first time he has blended a semi-fantasy element with entertainment.
About Tollywood
Tollywood refers to the Telugu language film industry. The name derives the concept from Hollywood.Tollywood is based in the state of Andhra Pradesh in southern India. The major Tollywood studios are located in Hyderabad, AP. Tollywood is the largest producer of films in India. In average Tollywood produces between 200 and 250 Telugu movies a year.
Popular movies tend to open during the three festive seasons of the region: Sankranthi, Summer, and Dushera. The Telugu film industry accounts for 1% of the gross domestic product of Andhra Pradesh. Telugu films enjoy significant patronage in the neighboring southern States like Tamil Nadu, Karnataka.
The first Telugu film Bhishma Pratigna was made in 1922 by R.S. Prakash. The first Telugu talkie Bhakta Prahlada, was released in 1931.
Andhra Pradesh is the state having more than 2700 theaters, where Hyderabad alone consists of 150 theatres. It is arguably the state having the largest number of theaters.
For young heroines, waiting for a break in Bollywood - telugu movies are good place to begin with and are considered a gateway. This is because Tollywood is the biggest regional movie market in India and the work there is closely monitored by the big names in Hindi film industry who are on the lookout for storylines to remake and fresh talent be it actors or technicians.